TG | పీడీఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా….

TG | పీడీఎస్‌యు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా….

TG |ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామానికి చెందిన బి. అజయ్ కి పి.డి.ఎస్. యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామ యువకుడు బి. అజయ్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో చురుకైన నాయకుడిగా పనిచేస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించారు. గతంలో జిల్లా స్థాయిలో పలు పదవులు చేపట్టి విద్యారంగ సమస్యలపై నిరంతరాయంగా పోరాటం చేస్తూ ఇటీవల వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

మూడు రోజులపాటు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన మహాసభలో బి అజయ్ ను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు మంగళవారంఆంధ్రప్రభ కు తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడం తోపాటు విద్యార్థుల్లో చైతన్యం తీసుకువచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు పెండింగ్ లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విద్యా ఉద్యోగ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘం తరపున తనకు అప్పజెప్పిన పదవికి న్యాయం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ లో తమ గ్రామానికి చెందిన అజయ్ కి స్థానం కల్పించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సన్మానిస్తున్నారు.

Leave a Reply