Rudrur | డిఎంహెచ్వో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ…

Rudrur | డిఎంహెచ్వో ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ…

Rudrur | రుద్రూర్, ఆంధ్రప్రభ : రుద్రూర్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్ నిలువలు, పలు రికార్డులను ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిధిలో పేషెంట్లకు, గర్భిణి ల వివరాల నమోదు ఓపి తదితర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు సిబ్బంది కూడా తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది దీర్ఘకాలిక పేషెంట్లకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సిబ్బంది తీసుకోవలసిన పలు విషయాలపై సూచనలు సలహాలు చేశారు. రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్ అయోష సిద్ధిక ను ఆదేశించారు. ఈ ప్రత్యేకమైన క్లినిక్ లో స్థానిక వైద్యాధికారి అయోష సిద్దికతో పాటు ఆరోగ్య విస్తీర్ణ అధికారి శ్రీనివాస్, ఆరోగ్య పరివేక్షకురాలు సుమతి, ఎల్. టి. సురేష్, నర్సింగ్ ఆఫీసర్ వరలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది గౌరీ, శిరీష, వాసంతి, ఎం ఎల్ హెచ్పి శిరీష వేషాలు ఉన్నారు.

Leave a Reply