sanitation in 2026 | మేడారం జాతరలో ప్లాస్టిక్ ముప్పు.. నివారణకు తెలంగాణ ప్రభుత్వ కఠిన చర్యలు

sanitation in 2026 | సమ్మక్క–సారలమ్మ జాతరలో పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
ప్లాస్టిక్ నివారణకు తెలంగాణ ప్రభుత్వ కఠిన నిర్ణయాలు
పర్యావరణ అనుకూల జాతరగా మేడారం మార్పు దిశగా అడుగులు
భారీ పారిశుధ్య ఏర్పాట్లు.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు
sanitation in 2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క,సారలమ్మ. ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ మహోత్సవానికి దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచీ కూడా కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. భక్తి, సంప్రదాయం, ఆదివాసీ సంస్కృతి కలగలిసిన ఈ జాతర ప్రపంచానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కానీ ఈ మహాజాతరలో భక్తితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల భారం. గత జాతర సమయంలో మేడారం అటవీ ప్రాంతం నుంచి వేల టన్నుల వ్యర్థాలు బయటకు తీసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇందులో వందల టన్నుల మేరకు ప్లాస్టిక్ ఉండడం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురి చేసింది. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లు అడవుల్లో పేరుకుపోవడంతో భూగర్భజలాలకే కాదు, అటవీ జీవజాలానికి కూడా తీవ్ర ముప్పు ఏర్పడింది. ప్లాస్టిక్ నివారించాడనికి తెలంగాణ ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. జాతర ప్రాంతంలో వ్యాపారులు తప్పనిసరిగా పర్యావరణ అనుకూల పదార్థాలనే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. క్లాత్ బ్యాగులు, స్టీల్ గ్లాసులు, ఆకులతో చేసిన ప్లేట్లు వాడాలని భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు.
అదేవిధంగా జాతర ప్రాంగణం అంతటా ప్రత్యేక చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వ్యర్థాలను వేర్వేరు విభాగాలుగా వర్గీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు, వాలంటీర్లతో కలిసి రోజువారీగా చెత్త తొలగింపు చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్లాస్టిక్ నివారించడాకి భక్తులు సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తెలంగాణ ప్రభుత్వం మేడారంలో భారీ ఏర్పాట్లు చేసింది. 5,500 తాత్కాలిక నీటి కుళాయిలు, 517 బ్యాటరీ కుళాయిలు, 47 సిస్టర్న్లు, 312 సిస్టర్న్ కుళాయిలు, 10 చలి వేంద్రాలు ఉన్నాయి. 285 టాయిలెట్ బ్లాక్‌లలో 5,700 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.

మరుగుదొడ్ల శుభ్రంగా ఉండేందుకు 3 షిఫ్టులలో 5,000 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. మేడారం ప్రాంతాన్ని 25 పారిశుధ్య విభాగాలుగా విభజించారు. రంగాల వారీగా 526 మంది పర్యవేక్షకులను నియమించారు. వ్యర్థాల తొలగింపు కోసం 100 ట్రాక్టర్లు, దుమ్ము అణచివేతకు 150 నీటి ట్యాంకర్‌లు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా .. పర్యవరణాని కాపాడేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.
