Avanigadda | రూ.52లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Avanigadda | రూ.52లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

కూటమి ప్రభుత్వంలో ఇప్పటికి నియోజకవర్గంలో 1,088మందికి రూ.8.75కోట్లు వైద్యానికి సహాయం
పార్టీలకు అతీతంగా సహాయం చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదములు

  • ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

Avanigadda | అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,088మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చులకు రూ.8,74,71,249లు అందచేసినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 81మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.52,41,102లు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటికి 1,088మందికి రూ.8,74,71,249లు సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని అందచేసినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల వైద్యానికి పెద్దఎత్తున సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా పేదలు తమ వైద్య ఖర్చుల కోసం ఎల్ఓసీలు, రీ-ఎంబర్స్ మెంట్ కోరుతూ పంపే దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా ఆమోదిస్తూ సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు లబ్ధిదారుల తరపున ధన్యవాదములు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply