TG | చెస్ ఆట విద్యార్థుల మేధస్సు వికాసానికి బాటలు

TG | చెస్ ఆట విద్యార్థుల మేధస్సు వికాసానికి బాటలు

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి…

TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ : చెస్వాటతో విద్యార్థుల మేధస్సు వికాసానికి బాటలు వేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు .మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు చెస్ ఆట విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని చెప్పారు. చెస్ క్లబ్ ఫౌండర్ చైర్మన్, సుధీర్ కోదాటి విద్యా రంగానికి చేసిన సేవలు ప్రశంసనీయమని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు. దేశ్పాండే ఫౌండేషన్ , కాకతీయ సాండ్‌బాక్స్ టెక్నాలజీస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నేత రాజా రెడ్డి సౌజన్యంతో, సుధీర్ కోదాటి దాదాపు 500 చెస్ బోర్డులను ప్రభుత్వ పాఠశాలలకు బహూకరించడం పట్ల సభలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా సుధీర్ కోదాటి మాట్లాడుతూ… “నేటి విద్యార్థులు మొబైల్ వ్యసనానికి లోనవుతున్న ఈ సమయంలో, ఇండోర్ గేమ్ అయిన చదరంగం ద్వారా వారి ఆలోచనా శక్తి, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి. చెస్ కేవలం ఆట మాత్రమే కాదు అది జీవితాన్ని నేర్పించే గురువు” అని అన్నారు.

TG

మండల విద్యాధికారి రాజగంగారెడ్డి మాట్లాడుతూ… “ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చదువు తో పాటు మేధో వికాసం కూడా అత్యంత అవసరం. చెస్ వంటి మేధస్సును పెంపొందించే ఆటలను పాఠశాలల స్థాయిలో ప్రోత్సహించడం వల్ల విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయి. ఈ దిశగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సుధీర్ కోదాటి గారి సేవలు పూర్తిగా రాజకీయేతరంగా, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాగుతున్న ఆదర్శ కార్యక్రమాలు” అని తెలిపారు. సుధీర్ కోదాటి విదేశాల్లో స్థిరపడి కూడా మాతృదేశం, మాతృభూమిపై చూపుతున్న మమకారం ఆదర్శనీయం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మేధో వికాసానికి చెస్‌ను ఉద్యమంలా తీసుకెళ్లడం అభినందనీయంఅని ప్రశంసించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… “ప్రభుత్వాలకే సాధ్యమయ్యే స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సుధీర్ కోదాటి సేవా దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకం. చెస్ బోర్డుల పంపిణీ ద్వారా విద్యార్థుల భవిష్యత్తులో విజేతలను తయారుచేస్తున్నారు అని కొనియాడారు.

సౌత్ క్యాంపస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నారాయణ గుప్తా మాట్లాడుతూ… “చదరంగం ద్వారా విద్యార్థులలో శాస్త్రీయ దృష్టికోణం, సమస్య పరిష్కార నైపుణ్యం పెరుగుతుంది. ఈ ఆలోచనను క్షేత్రస్థాయికి తీసుకువచ్చిన సుధీర్ కోదాటి కి అభినందనలు” అన్నారు.
జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాం రెడ్డి మాట్లాడుతూ.. “చెస్ విద్యార్థుల మేధస్సుకు వ్యాయామంలాంటిది. ఇలాంటి కార్యక్రమాలు విద్యతో పాటు మానసిక ఆరోగ్యానికీ దోహదపడతాయి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సునీత , ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి , ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి , మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు, టెంపుల్ చైర్మన్ , వైస్ చైర్మన్ లింబాద్రి, దయాకర్ రెడ్డి , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ , సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆంజనేయులు, చెస్ నెట్వర్క్ క్లబ్ సభ్యులు కిరణ్ రెడ్డి ,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భవాని మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply