TG | ఉత్తమ ఆర్డీవో శేఖర్ రెడ్డికి సన్మానం

TG | ఉత్తమ ఆర్డీవో శేఖర్ రెడ్డికి సన్మానం
- మాజీ ఎంపీపీ సుజాత రాజశేఖర్ రెడ్డి
TG | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ల చేతుల మీదుగా జిల్లా స్థాయి ఉత్తమ ఆర్డీవో అవార్డును అందుకున్న చౌటుప్పల్ ఆర్డిఓ వెలమ శేఖర్ రెడ్డి ని ఈ రోజు మాజీ ఎంపీపీ వెలగ సుజాత రాజశేఖర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెల్గ రాజశేఖర్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందిస్తూ ఆర్డీవో కార్యాలయంలో శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆర్డీవో శేఖర్ రెడ్డి మరిన్ని అవార్డులను అందుకు అవడంతో పాటు ఉద్యోగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ తొర్పునూరి కృష్ణ గౌడ్, ఆర్డిఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శర్మ, నాయకులు డాకోజి లక్ష్మీనారాయణ, గుండు వెంకటేశం, శ్రీపతి స్వామి తదితరులు పాల్గొన్నారు.
