BRS | దమ్ముంటే మళ్లి రాజీనామా చేయగలవా?

BRS | దమ్ముంటే మళ్లి రాజీనామా చేయగలవా?
- అసంపూర్తి పనులు పూర్తి కావాలంటే బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ఫైర్
BRS | చండూర్, ఆంధ్రప్రభ : నియోజక వర్గ ప్రజలకు బీరు, బిర్యాని రాజకీయాలు పరిచయం చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మద్యం అమ్మకాలపై నిబంధనలు పెట్టటం విడ్డురంగా ఉందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో ప్రారంభమై నేటికీ అసంపూర్తిగా వున్న దోభి ఘాట్, సమీకృత మార్కెట్, మున్సిపల్ భవనం, స్మశాన వాటిక అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ మద్యం అమ్మకాల సమయం పై ప్రభుత్వంతో మాట్లాడకుండా తన గుండాలతో వైన్స్ లపై దాడులు చేయించటం ఎందుకని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటరుకు కొటరు ఇవ్వకుండా గెలవగలవా అని సవాల్ విసిరారు. నీ అండదండలతో రోడ్డు విస్తరణ పనుల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు వసూళ్లు చేసింది వాస్తవం కాదా దేవుణ్ణి గుళ్లో చర్చకు సిద్ధమా దాంట్లో నీ వాటా ఏంత అంటూ ఆయన నిలదీశారు.
ఔరాని మంత్రి పదవి గురించి పదే పదే మాట్లాడటం కంటే యూరియ, పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్నా స్కూటీ లు పద్మశాలీల రుణ మాఫీ త్రిఫ్ట్ రంగులపై, నూలుపై సబ్సిడీ లు బందు చెయటం పై ఎందుకు మాట్లాడరు మంత్రి పదవి రాదనీ భయమా అన్నారు.మా పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులను బెదిరించి కాంగ్రెస్ లో చెర్చుకోవటానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తుండని ఉద్యమ పార్టీలో వున్న మేము మీ బెదిరింపులకు బయపడమన్నారు. రాష్ట్రంలో తక్కువ జనాభా వున్న చండూరును మున్సిపాలిటీ గా ఏర్పాటు చేసామన్నారు.
చండూరు రూపు రేకలు మార్చాలని 40 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేసామన్నారు. మా ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు ప్రారంబించిన పనులు ప్రస్తుత ఎమ్మెల్యే నేటికీ పూర్తి చేయలేకపోయారన్నారు. మున్సిపల్ ప్రజల తాగునిటీ సమస్యను తీర్చటానికి 12 కోట్ల అమృత్ నిధులు మంజూరు చేయించనాన్నారు. 30 పడకల ఆసుపత్రి కి నిధులు మంజూరు చేసిన నేటికీ పనులు ప్రారంభించలేదు కానీ వంద పడకల ఆసుపత్రి అంటూ ఎమ్మెల్యే ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. తన రాజీనామా ద్వారానే నియోజకవర్గానికి నిధులు వచ్చాయాని అంటున్న ఎమ్మెల్యే దమ్ముంటే మళ్ళీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో రెండున్నర సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం అని ఇప్పటికైనా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి, మంత్రుల ను కలిసి అభివృద్ధి నిధులు తీసుకరావాలని హితవు పలికారు.
మున్సిపాలిటీలో అసంపూర్తి పనులు పూర్తి కావాలంటే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ అభ్యర్థులను గెలిపించాలాని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో పది కి పది వార్డులు బి ఆర్ ఎస్ అభ్యర్థులు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, నాయకులు తోకల వెంకన్న,కొత్తపాటి సతీష్, బొడ్డు సతీష్ గౌడ్,నకిరకంటి రామలింగం, తెలుకుంట్ల చంద్రశేఖర్,యాత్తపు మధుసూదన్ రావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.
