Farmer | రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలి

Farmer | రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలి

Farmer | రెంజల్, ఆంధ్రప్రభ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విబి జిరాంజి బిల్లును తక్షణమే రద్దు చేసి,రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. మంగళవారం తహసిల్ కార్యాలయానికి తరలివచ్చి ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిని ఇన్చార్జి తహసిల్దార్ శ్రావణ్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నడిపి నాగన్న, గుమ్ముల గంగాధర్ తో కలిసి పార్వతి రాజేశ్వర్ మాట్లాడారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడి, విబి జిరాంజి బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు కూలీకి రూ.6 వందల ఇచ్చే విధంగా చూడాలని అన్నారు. యాసంగిలో వరి నాట్లు వేసి,నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతు భరోసా వేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఒక వైపు మాది ప్రజా పాలన, ప్రజల కొరకు పని చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదు. వర్షాకాలంలో పంటలు తీవ్రంగా నష్టం వాటిల్లందని, ప్రభుత్వం అంచనా వేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం, రైతు భరోసాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని పార్వతి రాజేశ్వర్ ఆరోపించారు. కార్యక్రమంలో మీద్దె పెద్దలు, పసుల గోపాల్, సిద్ధ పోశెట్టి, గంగారెడ్డి, మన్నె పోశెట్టి, ఎర్రన్న తదితరులు ఉన్నారు.

Leave a Reply