Accident | 13మందికి గాయాలు

Accident | 13మందికి గాయాలు

    Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో చోటుచేసుకుంది. రాగిమానుపెంట సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో సామర్థ్యానికి మించి 13మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఆటో బోల్తా కొట్టడంతో విద్యార్థులంతా కిందపడిపోయారు.

    ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

    Leave a Reply