TG | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

TG | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
TG | చిట్యాల, ఆంధ్రప్రభ : త్వరలో జరిగే చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కొరకు పార్టీ శ్రేణులు సైనికుల గా పనిచేయాలని బొగ్గు గనుల శాఖ కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంగళవారం నాడు కేంద్రమంత్రి కార్యాలయంలో నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చిట్యాల బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ మర్యాదపూర్వకంగా పూల బోకే అందించి కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థులకు మంత్రి ఆశీర్వాదం తెలిపారు మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు పార్టీ నుండి అన్ని సహకారాలు అందించడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. అని పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో బీజేపీ నాయకులు రుద్రవరం లింగస్వామి, కన్నెబోయిన మహాలింగం, కన్నెబోయిన శ్రీధర్, కన్నేబోయిన మురళీకృష్ణ తదితరు పాల్గొన్నారు.
