Anil Ravipudi | క్రేజీ మల్టీస్టారర్ సాధ్యమేనా…?

Anil Ravipudi | క్రేజీ మల్టీస్టారర్ సాధ్యమేనా…?

Anil Ravipudi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హిట్ మిషన్.. అనిల్ రావిపూడి.. వరుసగా 9 సినిమాలతో సక్సెస్ సాధించడంతో టాలీవుడ్ హీరోల దృష్టే కాదు.. కోలీవుడ్ హీరోల దృష్టి కూడా అనిల్ పై పడిందట. అది కూడా లెజెండ్స్, కోలీవుడ్ సూపర్ స్టార్స్.. రజినీకాంత్, కమల్ హాసన్ (Kamal hasan) దృష్టి అనిల్ పై పడిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ క్రేజీ కాంబో మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ అనిల్ కు రావచ్చని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఇది నిజమేనా..? ఈ కాంబో సాధ్యమేనా..?

Anil Ravipudi

Anil Ravipudi | లోకేష్ చెప్పిన సీక్రెట్..

సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్.. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. ఈ కాంబో మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ లోకేష్‌ కనకరాజ్ కి (Lokesh Kanakaraj) ఇవ్వాలి అనుకున్నారు. అంతా ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. లోకేష్‌ యాక్షన్ మూవీస్ ని బాగా డీల్ చేస్తాడు. అందుచేత రజినీ, కమల్ ఇద్దరికీ యాక్షన్ స్టోరీ చెబితే అది నచ్చలేదట. ఇద్దరూ వరుసగా యాక్షన్ మూవీస్ చేసి చేసి బోర్ కొట్టేసిందట. అందుచేత ఏదైనా సింపుల్ స్టోరీతో చేద్దామని చెప్పారట. సింపుల్ స్టోరీ నేను రెడీ చేయలేనని లోకేష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా లోకేష్‌ బయటపెట్టాడు.

Anil Ravipudi

Anil Ravipudi | సింపుల్ స్టోరీతో..

రజినీ, కమల్ కోరుకుంటున్నట్టుగా సింపుల్ స్టోరీతో సినిమా (Movie) చేసే సత్తా ఎవరికి ఉందంటే.. ఇప్పుడు టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈ ఇద్దరి ఇమేజ్ కు తగ్గట్టుగా సింపుల్ స్టోరీతో.. ఎంటర్ టైన్మెంట్ స్క్రిప్ట్ రాయడం అనేది అనిల్ కి మంచి నీళ్లు తాగినంత ఈజీ అని చెప్పచ్చు. టైమ్ కూడా ఎక్కువ తీసుకోడు.. ఓ ఇరవై రోజుల్లో స్క్రిప్ట్ రెడీ చేసేస్తాడు. ఇప్పటికే రజినీ, కమల్ దృష్టిలో అనిల్ పడ్డాడని వార్తలు వస్తున్నాయి. రీసెంట్ ఇండస్ట్రీ బిగ్ హిట్ మన శంకర్ వరప్రసాద్ గారు గురించి తెలుసుకున్నారట.

Anil Ravipudi

Anil Ravipudi | సౌత్ లో టాప్ డైరెక్టర్..

మన శంకర్ వరప్రసాద్ గారు సక్సెస్ గురించే కాదు.. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ గురించి.. అనిల్ వరుసగా 9 సినిమాలతో సక్సెస్ సాధించడం గురించి తెలుసుకున్నారని వార్తలు రావడం ఆసక్తిగా మారింది. అనిల్ సినిమాలు రీజనల్ మార్కెట్ లో బాగా వర్కవుట్ అవుతున్నాయి. ప్రొడ్యూసర్స్ (Producer) అనిల్ కి ఎంతైనా ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. 25 కోట్లు తీసుకుంటున్న అనిల్ కి రెమ్యూనరేషన్ డబుల్ చేసి 50 కోట్లు ఇచ్చేందుకు కూడా రెడీ అంటున్నారు. టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ లోనే టాప్ డైరెక్టర్ గా మారిపోయాడు అనిల్ రావిపూడి. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా రజినీ, కమల్ కాంబో మూవీని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుంటాడేమో చూడాలి.

CLICK HERE TO READ మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు

CLICK HERE TO READ MORE

Leave a Reply