Telangana | కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరికలు..

Telangana | కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరికలు..

Telangana, చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 10వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు మసనం శ్రీనివాస్, ముసనం సంగీతలు తమ అనుచురతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, పార్టీ మున్సిపల్ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిల సమక్షంలో బీజేపీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి మనోహర్ రెడ్డి, సుభాష్ రెడ్డి లు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దూడల బిక్షం గౌడ్, రమణగోనీ శంకర్, బాతరాజు సత్యం, శాగ చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, కడారి కల్పన ఐలయ్య యాదవ్, పోలోజు శ్రీధర్ బాబు, ఆలే చిరంజీవి, గోశిక పురుషోత్తం, తడక సురేఖ, గోసిక నీరజ, గోశిక ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply