28th to 31st jan | మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలి? బస్సు, రైలు, ప్రైవేట్ వాహనాల పూర్తి గైడ్

28th to 31st jan | మేడారం జాతరకు రవాణా సౌకర్యాలు: ఎక్కడి నుంచి ఎలా చేరుకోవాలి?

28th to 31st jan | మేడారం జాతర ప్రాముఖ్యత
మేడారం ఎక్కడ ఉంది? దూర వివరాలు
TSRTC ప్రత్యేక బస్సు సౌకర్యాలు
రైల్వే ద్వారా మేడారం చేరే విధానం
స్వంత వాహనాలతో ప్రయాణం చేసే వారికి సూచనలు
ప్రైవేట్ ట్రావెల్స్ & గ్రూప్ ట్రిప్స్
విమాన మార్గం ద్వారా వచ్చే వారికి మార్గదర్శనం
భక్తులు తప్పక గుర్తుంచుకోవాల్సిన సూచనలు

28th to 31st jan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మహా సం రంభానికి సమయం ఆసన్నమయింది… ప్రపంచ ప్రసిద్ధి పొందిన తెలంగాణలోని మహా జాతర సమ్మక సారలమ్మ జాతర ఆరంభం కానుంది. ఎక్కడెక్కడి నుంచి జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇంకా భారీ సంఖ్యలో రానున్నారని నిర్వాహకుల్;అ అంచనా… అయితే ఈ మహా జాతరకు ఉన్న ఉన్న రవాణా సౌకర్యాలేమిటి? ఎక్కడెక్కడి నుంచి ఎలా రావాలి? ఈ వివరాలు మీకోసమే.

తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాయి. మీరు ఎక్కడి నుంచి అయినా సులభంగా చేరుకునేలా ప్రజా రవాణా, ప్రైవేట్ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలో కొలువై ఉన్న మేడారం కి సమీప పట్టణం తాడ్వాయి, ములుగు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి మేడారం కి దూరం సుమారు 280 కిమీ. సమీప పట్టణం వరంగల్ నుంచి మేడారం కి దూరం సుమారు 120 కిమీ. మేడారం కివిస్తృతంగా అందుబాటులో ప్రజా రవాణా టీఎసార్టీసీ బస్సులున్నాయి.

జాతర సమయంలో తెలంగాణ ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ముఖ్య నగరాల నుంచి ప్రత్యేక బస్సులు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి నుంచి మేడారం కి బస్సులు ఫ్రీక్వెంట్ గా ఉన్నాయి. వీటిలో ఎక్కువగా బస్సులు ఈ రూట్లలో వెళ్తాయి హైదరాబాద్ → వరంగల్ → ములుగు → తాడ్వయి → మేడారం ఇలా ఉన్నాయి.

ప్రజారవాణా వల్ల ఒనగూడే భక్తులకు ప్రయోజనాలు, తక్కువ ఖర్చు, సురక్షిత ప్రయాణం. నేరుగా మేడారం వరకు బస్సులు చేరుకునే అవకాశం. జాతర రోజులలో 24 గంటల సర్వీస్ ఉంటుంది ఎప్పుడైనా మేడారం దాకా సురక్షితంగా చేరుకోవచ్చు. తెలంగాణ మహిళలకు ప్రభుత్వ పథకాల ప్రకారం ఉచిత/రాయితీ ప్రయాణం సౌకర్యం ఉన్నందున మరింత ప్రయోజనకరం. రైలు మార్గం ద్వారా మేడారం జాతరకు రావాలనుకునేవారికోసం మేడారం దగ్గర రైల్వే స్టేషన్ లేదు.

కాబట్టి సమీప స్టేషన్ల వరకు వచ్చి, అక్కడి నుంచి బస్సు లేదా ఆటో తీసుకోవాలి. సమీప రైల్వే స్టేషన్లు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కాజీపేట ల్లో ఎక్కడైనా దిగి అక్కడి నుంచి టీఎసార్టీసీ బస్సులు, లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా మేడారం వరకు సులభంగా చేరుకోవచ్చు.

కార్ లేదా బైక్ ఇలా తమ స్వంత వాహనాలతో మేడారం రావాలంటే హైదరాబాద్ → వరంగల్ → ములుగు → తాడాద్వయి → మేడారం చేరుకోవచ్చు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే..మేడారం రోడ్లు జాతర సమయంలో సాధారణంగా బాగానే ఉంటాయి, కానీ జాతరకు భారీ సంఖ్యలో విచ్చేసే భక్తుల వాహనాలతో భారీ ట్రాఫిక్ జాం లు తప్పవు. పార్కింగ్ కోసం మేడారం నుంచి చాలా దూరం వరకు ప్రత్యేక స్థలాలు కేటాయించడం జరుగుతుంది. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు కాబట్టి జాతరకు ముందే బయలుదేరడం, గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ చేరుకోవడం, ట్రాఫిక్ సూచనలు పాటించడం ముఖ్యం.

ఇక ప్రైవేట్ ట్రావెల్స్ & టూర్స్ విషయానికొస్తే, జాతర సమయంలో టెంపో ట్రావెలర్స్, టూర్స్ & ట్రావెల్స్ బస్సులు ఉంటాయి. భక్తుల గ్రూప్ ట్రిప్స్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇవి అందుబాటులో చాలానే ఉంటాయి. వీటిని ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా, లోకల్ బుకింగ్ సెంటర్స్ ద్వారా, ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.

విమాన మార్గం ద్వారా రావాలనుకునేవారు గామనించవలసిన విషయ్మేమిటంటే, మేడారం కోసం నేరుగా ఎయిర్‌పోర్ట్ లేదు. సమీప విమానాశ్రయం: హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకే రావాలి. అక్కడి నుంచి బస్సు లేదా ట్రైన్ ద్వారా మేడారం చేరాలి. రవాణా మాత్రమే కాక మేడారం చేరుకునే భక్తులు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయాలివే. ఆడవారు, చిన్నపిల్లలు, సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి.

28th to 31st jan |
28th to 31st jan |

ఎందుకంటే ప్రయాణంలో, రద్దీలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది కనుక. ప్రతి ఒక్కరూ తమతో బాటు నీటి బాటిల్స్, ఓఆర్‌ఎస్ వెంటబెట్టుకోవడం మంచిది. జాతరలో లభించే త్రాగునీటి సౌకర్యాలు ఎంతమందికి సరిపోతాయో చెప్పలేం. అలాగే అక్కడ షాప్పుల్లో లభించే మంచినీటి బాటిల్స్ కూడా ఎంతవరకు సురక్షితమో చెప్పలేం. తమ వెంట ఉన్న చిన్న పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి…అనుక్షణం వారిని కనిపెట్టుకునే ఉండాలి.

అక్కడి స్థానిక పోలీసు, నిర్వహణాధికారుల సూచనలు గమనిస్తూ, తప్పక పాటించాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది గంటలకొద్దీ జనం రద్దీలో, చెట్ల కింద నుంచి జాతరకు చేరుకోవడం, దర్శనం చెసుకుని వెనక్కు రావడం ఉంటుంది కాబట్టి, అంత సేపు, అంత దూరం ఫోన్ల చార్జింగు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అందుకని ఫోన్ బ్యాటరీ పవర్ బ్యాంక్ ఉంటే మంచిది.

click here to read more

click here to read 1 Ravi Dosha Remedies | లక్షణాలు, ప్రభావాలు మరియు పరిహారాలు

Leave a Reply