వైద్యరంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను డాక్టర్ దిడ్డి స్వప్న లత కు ప్రశంసా పత్రం

కలెక్టర్ చేతుల మీదుగా డాక్టర్ స్వప్నలతకు ప్రశంసా పత్రం అందజేత

కరీమాబాద్ జనవరి 26 ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ సేవలందించిన వారికి జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వరంగల్ కోటలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైద్యరంగం గైనకాలజిస్ట్, ఇన్ఫెర్టిలిటీ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను డాక్టర్ దిడ్డి స్వప్న లత శ్రావణ్ కు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంకిత్ కుమార్ చేతుల మీదుగా డాక్టర్ స్వప్నలతకు ప్రశంసా పత్రం అందజేశారు. సందర్భంగా పలువురు డాక్టర్ ను అభినందించారు.

Leave a Reply