High school | ఆలేరు ఎన్ సిసి విద్యార్థులకు అభినందనలు

High school | ఆలేరు ఎన్ సిసి విద్యార్థులకు అభినందనలు
High school | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఈ రోజు జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఆలేరు జెడ్పి బాలుర హై స్కూల్ ఎన్ సీసీ విద్యార్థులను, వివిధ కార్యక్రమాల నిర్వాహణలో వారు అందిస్తున్న తోడ్పాటును జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేకంగా అభినందించారు.
కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలు దాసరి మంజుల, ఎన్ సీసీ అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయ బృందం ఎన్ సీసీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
