Bheemgal | బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్ అందజేత

Bheemgal | బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్ అందజేత
Bheemgal | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ పట్టణంలోని రిపబ్లిక్ డే సందర్భంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా మొహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ… భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కు కల్పించింది వాటిని పరీక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సోమవారం కార్యాలయం వద్ద స్థానిక వ్యాపారస్తులు అభిమాన నాయకులతో కలిసి జెండా పథకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాస్వామ్యం విలువలను కాపాడుతూ రాష్ట్ర దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తమవంతుగా కృషి చేయాలని అన్నారు.
అలాగే ఇటీవల ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో ఈనెల 2న నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో హాజర్ బ్లడ్ డొనేషన్ చేసిన వారికి రిపబ్లిక్ డే సందర్భంగా సర్టిఫికెట్లు మహమ్మద్ ఆరిఫ్ చేతుల మీదగా సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాఫిజ్ సిరాజ్, అబ్దుల్లా, సుమేర్ అజీమ్, అవేజ్, జాకీ, అజర్, సయ్యద్ అత్తరుద్దీన్, అఖిల్, నవీన్, లింబాద్రి, ఉడుత మహేష్ సుధాకర్, సదాశివ్, దావుత్ ఫయాజ్, అశోక్,నగేష్, అల్మాస్, మిస్బా, మాధవరెడ్డి, అసిఫ్, మొహిమ్, అబుబక్కర్, వసీం, మోసిన్ తదితరులు పాల్గొన్నారు.
