Makthal | స్వాతంత్ర్యాన్ని సాదించిన మహానీయుడు బాపూజీ

Makthal | స్వాతంత్ర్యాన్ని సాదించిన మహానీయుడు బాపూజీ
- రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
- హిందూపూర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : అహింసా మార్గంలో బ్రిటిష్ రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ అని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. మహాత్ముడి బోధనలో మార్గం నేటికీ ఆచరణీయం అనుసరణీయమని మంత్రి పేర్కొన్నారు. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండల పరిధిలోగల హిందూపూర్ గ్రామ చౌరస్తాలో 158వ జాతీయ రహదారిపై ఆర్యవైశ్య సంఘం మక్తల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ కె. అశ్విని మహేష్ తో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతిపితకు గజమాలను చేసి శ్రద్ధాంజలి ఘటించారు .
అనంతరం మంత్రి మాట్లాడుతూ… శాంతి యుతంగా అహింసా మార్గంలో మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత బాపుజీదన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యాన్ని గడగడలాడించి మనకు స్వాతంత్య్రం తెచ్చి దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మధ్య కొన్ని పథకాలలో బాపుజీ పేరు తీసివేసి ఆయన పేరును ఉనికిలో లేకుండా చేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమ్మన్నారు. కొన్ని సామాజిక మాధ్యమాలాల్లో గాంధీజీ గురించి అభ్యంతకరమైన పోస్టులు పెడుతూ పైషాచిక ఆనందం పొందుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బాపుజీ గురించి మాట్లాడే స్థాయి మనది కాదన్నారు. దేశ స్వాతంత్ర్యo కోసం ప్రాణాలర్పించిన మహనీయుల జీవన గాదలను భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
కొన్ని దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం రోడ్డు ప్రమాదంలో ధ్వంసం కావడంతో పట్టించుకునే వారు లెకపోవడంతో మక్తల్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు ముందుకు వచ్చి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా మక్తల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్త, కట్టా సురేష్ కుమార్ గుప్తా, మనసాని నాగరాజ్, ఎల్ఎన్.జగదీష్, దొంత నరహరి, ఎల్ఎన్ శ్రీనివాస్, కృష్ణ సర్పంచ్ నగేష్, కాంగ్రెస్ నాయకులు రాజప్ప గౌడ, ఆనంద్ గౌడ్, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు.
