Choutuppal | ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు…

Choutuppal | ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు…
- వాడవాడలో ఎగిరిన జాతీయ పతాకాలు
Choutuppal | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ తోపాటు మండలంలోని వివిధ గ్రామాలలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద, స్వచ్ఛంద సంస్థల వద్ద, గ్రామపంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల వద్ద త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. ప్రధానంగా చౌటుప్పల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఆర్డిఓ వెలమ శేఖర్ రెడ్డి, పోలీస్ డివిజనల్ కార్యాలయం వద్ద డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ వీరాబాయి, మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి, మండల వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, ఎంపీడీవో కార్యాలయం వద్ద సూపరిండెంట్ విజయ్ కుమార్, పోలీస్ స్టేషన్ వద్ద ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఇన్స్పెక్టర్ విజయ మోహన్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ అలివేలు, బాలికల గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్ విజిత, రాజీవ్ స్మారక భవనం వద్ద చైర్మన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి, బీజేపీ మండల కార్యాలయం వద్ద అధ్యక్షుడు కైరంకొండ అశోక్, మున్సిపల్ కార్యాలయం వద్ద పార్టీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, బీఆర్ఎస్ మండల కార్యాలయం వద్ద గిర్కటి నిరంజన్ గౌడ్, పార్టీ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు వివిధ కార్యాలయం వద్ద ఆయా కార్యాలయాల అధ్యక్ష, కార్యదర్శులు, గ్రామ పంచాయతీల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పాఠశాలలో కళాశాలలో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాలలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
