Sports | క్రీడలు ఐక్యతను పెంపొందిస్తాయి..

Sports | క్రీడలు ఐక్యతను పెంపొందిస్తాయి..
- వైరా ఎస్సై పుష్పాల రామారావు..
Sports | వైరా, ఆంధ్రప్రభ : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని.. వైరా ఎస్సై పుష్పాల రామారావు పేర్కొన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు బోడిపూడి కాలనీలో క్రియేటర్స్ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటువంటి పోటీలను నిర్వహించటం ఎంతో అభినందనీయమని.. క్రియేటర్స్ యూత్ నిర్వాహకులు దుగ్గిరాల ప్రవీణ్,తలారి మనోహర్, పిరికల రాజేష్, సల్మాన్, పాషా లను ఆయన అభినందించారు. ఈ క్రీడా పోటీల్లో బోడిపూడి కాలనీతో పాటు పలుచోట్ల నుండి చిన్నారులు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బోడెపుడి కాలనీ యూత్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు.

