Kadem | కడెంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Kadem | కడెంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Kadem | కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో సోమవారం త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ పార్టీల కార్యాలయాల వద్ద యువజన సంఘాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పలు పాఠశాలల విద్యార్థుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు పలు గ్రామాలలో ర్యాలీలు నిర్వహించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన నాయకులను స్మరించుకున్నారు.

మండల కేంద్రంలోని కడెం తహసిల్దార్ కార్యాలయం వద్ద మండల తహసిల్దార్ రోడ్డు ప్రభాకర్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో జే సునీత అటవి అధికారుల కార్యాలయంలో ఎఫ్ ఆర్ ఓ గీతారాణి, గ్రంథాలయంలో గ్రంథాలయం అధికారి విజయశంకర్, పోలీస్ స్టేషన్ లో ఖానాపూర్ సిఐ సిహెచ్ అజయ్, కడెంలోని పెద్దూరు జిపి కార్యాలయంలో పెద్దూరు కడం సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ జెండా ఆవిష్కరించారు. పశు వైద్యశాలలో డాక్టర్ సౌందర్య, కడం పిహెచ్ సీలో డాక్టర్ శివకుమార్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఈ ఈ ప్రవీణ్ కుమార్, ఏ డి సి సి బ్యాంకులో మేనేజర్ రాజేశ్వరరావు, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఎం ఏ ఓ దినేష్, ఎమ్మార్సీలో కడం ఎంఈఓ షేక్ హుస్సేన్ జెండా ఆవిష్కరించి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియచేశారు.

విజయ పాల కేంద్రంలో మేనేజర్ ఎస్ వెంకటస్వామి, నచ్చని ఎల్లాపూర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ సిహెచ్ శకుంతల, కేజీబీవీ పాఠశాలలో ఎస్ ఓ కే విమల కడం జడ్పీ హైస్కూల్ లో హెచ్ ఎం ఎం శ్రీనివాసరెడ్డి, ఐకెపి కార్యాలయంలో ఏపిఎం వి గంగాధర్, లింగాపూర్ జడ్పీ హైస్కూల్ లో హెచ్ ఎం బి వెంకటరమణ అంబారిపేట్ జెడ్పీ హైస్కూల్ లో హెచ్ఎంవి రమేష్, బీజేపీ పార్టీ కార్యాలయంలో కడెం బీజేపీ మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం గంగేశ్వర్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు కనుల పండగ కొనసాగాయి. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాలు ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply