Registrar Office | గుడివాడలో.. గణతంత్ర దినోత్సవ వేడుకలు

Registrar Office | గుడివాడలో.. గణతంత్ర దినోత్సవ వేడుకలు
Registrar Office | గుడివాడ, ఆంధ్రప్రభ : 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడ రిజిస్ట్రార్ ఆఫీస్‌లోని వేదిక పై గుడివాడ సబ్ రిజిస్ట్రార్ వి.మని చైతన్య ఆధ్వర్యంలో ఆఫీస్ సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై భారతదేశ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ సబ్ రిజిస్ట్రార్ వి. మని చైతన్య ముఖ్య అతిథిగా వ్యవహరించి జెండా ఎగురవేసి, జాతీయ గీతం పాడారు.
జెండా ఆవిష్కరణ అనంతరం గుడివాడ సబ్ రిజిస్ట్రార్ శ్రీ వి. మని చైతన్య ప్రజలకు స్వాతంత్ర్య, ప్రజాస్వామ్య విలువలను గురించి తెలియచేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నందుకు సిబ్బంది, స్థానికులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ తో పాటు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాజీవ్, సిబ్బంది శ్యామ్, చైతన్య, రవిశంకర్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
