Guntur | జిఎంసిలో గణతంత్ర వేడుకలు

Guntur | జిఎంసిలో గణతంత్ర వేడుకలు
Guntur | గుంటూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : గుంటూరు నగరపాలక సంస్థలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆవిష్కరణ చేశారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమీషనర్ మయూర్ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం, అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన త్యాగధనుల సేవలను ప్రతి ఒక్కరూ నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విధుల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. హిమని సెంటర్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, జిన్నా టవర్ సెంటర్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
