Megastar | ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్..

Megastar | ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్..
Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ మన శంకర వర ప్రసాద్ గారు. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ల పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు.

Megastar | ప్రజల్లోకి వెళ్ళండి..
ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. మీ ఆనందంలో సక్సెస్ ని ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్లీ పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా విజయాన్ని చూసి సుస్మిత చాలా ఎక్సైటింగ్ గా నాతో మాట్లాడింది. ఇలాంటి విజయాలు మీకు కామన్ అని చెప్పింది. సక్సెస్ ఎప్పుడూ కూడా బోర్ కొట్టదు. మనం ప్రతి రోజు తినే అన్నం కూర మనకు ఎలా అయితే.. బోర్ కొట్టవో విజయం ఇచ్చే ఉత్సాహం ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుంది. సీనియారిటీతో మెచ్యూరిటీ రావడంతో ఒక్కొక్కలా స్పందిస్తాం తప్పితే మీరందరూ ఈ విజయాన్ని ఎంతలా సెలబ్రేట్ (Celebrate) చేసుకుంటున్నారు. అంతకంత మనసులో నేను ఆస్వాదిస్తున్నాను. ప్రజల్లోకి వెళ్ళండి.. వాళ్లతో ఇంట్రాక్ట్ అవ్వండి.. ప్రేక్షకులు ఇచ్చే కిక్కు వేరే ఉంటుందని అనిల్, సాహు తో చెప్పాను. వాళ్ళు ఇచ్చే ఉత్సాహం భవిష్యత్తులో చేసే సినిమాలకి ఒక ఇంధనం లాగా పని చేస్తుంది. ఇలాంటి ప్రేమని నేను ఎన్నోసార్లు అనుభవించాను. అలాంటి ఉత్సాహం చాలా సంవత్సరాల తర్వాత పునరావృతం కావడం ఎంతో ఆనందంగా ఉంది.

Megastar | అనిల్ ని పరిచయం చేసింది ఆయనే..
ఎగ్జిక్యూటివ్స్ కి బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మా చేతుల మీద షీల్డ్స్ ఇవ్వడం చూస్తుంటే.. వింటేజ్ చిరంజీవినే కాదు వింటేజ్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ కూడా తీసుకొచ్చిన క్రియేటివ్ అనిల్ దే. నిజంగా ఇది నాకు ఒక నాస్టాలజీ ఫీలింగ్. అనిల్ వర్కింగ్ వర్కింగ్ స్టైల్ చూస్తే.. నాకు రాఘవేంద్రరావు గారు గుర్తు వస్తారు. ఆయనే నాకు అనిల్ ని పరిచయం చేశారు మేము కలిసి పని చేస్తే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన నమ్మకం నిజమైంది. వివి వినాయక్ లాగా అనిల్ కూడా మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. ఖైదీ 150, వాల్తేరు వీరయ్య తర్వాత ఈ మధ్యకాలంలో అంత ఎంజాయ్ చేస్తూ షూటింగ్ (Shooting) చేసిన సినిమా మన శంకర వరప్రసాద్. షూటింగ్ చివరి రోజు చాలా ఎమోషనల్ అయ్యాను. యూనిట్ అందరిని దగ్గరగా తీసుకుని నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఇలాంటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడికి తన రైటింగ్ టీంకి తన డైరెక్టర్ టీంకి అందరికీ థాంక్యూ.

Megastar | జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి..
అందరం కూడా ఒక కుటుంబంలో కలిసి పని చేశాం. సాహు, మా అమ్మాయి సుస్మిత అందరం కూడా ఒక ఫ్యామిలీ లాంటి ఫీలింగ్ తో కలిసి పని చేసాం. సినిమా షూటింగ్ సమయంలో టీం మధ్య ఒక ఫ్యామిలీ లాంటి బాండింగ్ ఉంటే దాన్ని రిజల్ట్ (Result) ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్ సినిమాలే. ఇంత గొప్ప విజయాన్ని మాకు ఇచ్చినందుకు, ఇందులో వారధిలా పని చేసిన బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి ఎగ్జిబిటర్స్ కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతికి వస్తున్న ప్రతి సినిమా అద్భుతంగా ఆడాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్టే ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. అన్ని సినిమాలకి సక్సెస్ అందించారు. అందరికీ కూడా మంచి సక్సెస్ దొరికింది. ఇది జీవితంలో మర్చిపోలేని సంక్రాంతి.. నిజంగా సంక్రాంతి అదిరిపోయింది.
Megastar | అది కోరుకున్నది నేనే..
నా మిత్రుడు సోదరుడు ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకి ఈ సినిమాలో ఉండాలని కోరుకున్నది నేనే. నేను కోరుకున్నట్టుగా ఈ సినిమాల్లో ఉండేలా చేశాడు డైరెక్టర్ అనిల్. వెంకీ సెట్ లో వున్న ప్రతి రోజు గొప్ప నవ్వులతో నిండిపోయేది. టీనేజ్ బాయ్స్ లాగా ఫీల్ అయిపోయాం. నా పాటలకి తన డాన్స్ చేయడం తన సాంగ్స్ నేను రిపీట్ చేయడం చక్కగా బ్యాలెన్స్ చేశాడు. ఇద్దరు సూపర్ స్టార్స్ ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసిన క్రిడెట్ అనిల్ ది. తను ప్లాన్ చేసిన విధానం అద్భుతం. అనిల్ తెలుగు సినిమా (Movie) ఫ్యూచర్. ఈ సినిమా చేస్తున్నప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ మళ్లీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. వెంకీ నేను కలిసి చేసే ఫుల్ లెంత్ సినిమా చేస్తే.. వస్తే బాగుంటుందని ఆలోచన ఉంది. మా ఇద్దరినీ అద్భుతంగా బ్యాలెన్స్ చేయగలననే భరోసా అందరికీ ఇచ్చాడు అనిల్. అది అలాంటి ఆ సినిమా జరగాలని కోరుకుంటున్నాను.

Megastar | రాజమండ్రి వీధుల్లో..
నిర్మాత సాహూ ఈ సినిమా రసస్ చూసే అదిరిపోయింది అన్నాడు. నిజంగా తన ఎక్కువ మాట్లాడరు. ఆ రోజే ఈ సినిమా విజయం గురించి హింట్ ఇచ్చిన వ్యక్తి సాహూ. సుస్మిత ఇండస్ట్రీ లోకి వస్తామని అనుకున్నప్పుడు తన ఫస్ట్ రామ్ చరణ్ తో (Ramcharan) చెప్పింది. తను వెల్కం చేసాడు. రంగస్థలంలో తన కాస్ట్యుమ్స్ ను చూసుకుంది. ఆ సినిమాకి ఒక లుంగీ కావాలంటే రాజమండ్రి వీధుల్లో తనే స్వయంగా తిరిగింది. అప్పుడే ఖచ్చితంగా ఇండస్ట్రీలో సాధించగలదనే నమ్మకం కుదిరింది. ఈ ఇండస్ట్రీ అద్దం లాంటిది మనం ఎలా ఉంటే దాని రిజెల్ట్ కూడా అలానే ఉంటుంది. తను నిర్మాత అవ్వాలనుకున్నప్పుడు వెబ్ సిరీస్ లో మొదలు పెట్టింది. అక్కడ అనుభవాన్ని సంపాదించింది. ప్రతి డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుంది. తర్వాత చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసింది. నిజానికి తను అనుకుంటే మా ఫ్యామిలీలో ఎవరో ఒక హీరోతో సినిమా చేయొచ్చు. కానీ తను అలా అనుకోలేదు. ఈ సినిమా కోసం సాహూతో కలిసి తనే సొంతగా ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా కోసం నేను నయా పైసా ఇవ్వలేదు. నాకు కావాల్సిన రెమినరేషన్ సమయానికి తగ్గట్టుగా ఆ ఇద్దరి నుంచి తీసుకున్నాను. అంత ప్రొఫెషనల్గా తన ప్రవర్తించింది. తను ఈరోజు ఈ విజయాన్ని ఆస్వాదిస్తుంది. ఒక ఫాదర్ గా సుస్మిత ను చూసి నేను గర్వపడుతున్నాను.
Megastar | అనిల్ అందులో దిట్ట..
కొరియోగ్రాఫర్ భాను విజయ్ (Banu Vijay) ఆట సందీప్ అందరికీ కూడా గొప్ప భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి అద్భుతమైన లిరిక్స్ అందించిన రైటర్స్, గొప్ప మ్యూజిక్ ఇచ్చిన భీమ్స్ కి అభినందనలు. అందరూ కూడా మీసాల పిల్ల పాటకి కనెక్ట్ అయిపోయారు. అలాగే వెంకటేష్ గారితో నా మీద సంక్రాంతి సాంగ్ అదిరిపోయింది. ఈ సినిమా 85 రోజుల్లో పూర్తి కావడానికి ప్రధాన పాత్ర వహించింది డీఓపి సమీర్ రెడ్డి. ఈ సినిమా రిలీజ్ కి ముందే సూపర్ హిట్ అయిపోయింది అని చెప్పాను. ఎందుకంటే.. అనుకున్న టైం కి అనుకున్న బడ్జెట్లో సినిమాని చేయగలిగాం. ప్రకాష్ అద్భుతమైన సెట్స్ వేశారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ అనిల్ ప్రమోషన్స్ లో దిట్ట. నయనతారని ఒప్పించి ప్రమోషన్స్ చేయించాడు.
ఈ క్యారెక్టర్ లో తను ఒదిగిపోయింది. తను ఈ సినిమాకి నిండుదనం తీసుకొచ్చింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) రైటింగ్ టీమ్ అందరికీ అభినందనలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక వీడియో చూశాను. మమ్మల్ని ఆనందింప చేయడం కోసం మీరు ఇంకా కష్టపడుతున్నారా అని ఓ మహిళా చెప్పిన లా ఎమోషనల్ గా అనిపించింది. కృతజ్ఞతతో నాకు కళ్ళు చెమర్చాయి. మిమ్మల్ని ఆనందంప చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని సంతోషపరిచేందుకు కష్టపడడంలో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేను పని చేయడానికి శక్తి మీ నుంచి వస్తుంది. ఈ జన్మ ఉన్నంత వరకు మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను. ఇది కొనసాగుతూనే ఉంటుంది. జైహింద్ అన్నారు.
CLICK HERE TO READ రవితేజకి ఆ ఇద్దరు బ్లాక్ బస్టర్స్ అందించేనా..?
