Funds | బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం

Funds | బీజేపీతోనే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యం
- పాలమూరు ఎంపీ డీకె.అరుణ
Funds | మక్తల్, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే అరుణ అన్నారు.ఆదివారం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామంలో ఎంపీ డీకే. అరుణమ్మ తన ఎంపి నిధుల నుండి చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామంలో గల శివాలయం దగ్గర రూ.10 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.
మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలకు రెండేళ్లుగా నిధులు ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మక్తల్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించినప్పటికీ ఆరు నెలలుగా పనులు ప్రారంభించలేదని అన్నారు.

గ్రామాల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిధులు ఇవ్వడం లేదని అన్నారు. రెండేళ్లుగా మక్తల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అందుకే రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బిజెపి అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించవలసిందిగా ఎంపీ డీకే అరుణ ణక్తల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య, రాష్ట్ర నాయకులు కొత్తకాపు రతంగ్ పాండు రెడ్డి , జిల్లా జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరామ్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షుడు కర్ని స్వామి, అర్బన్ అధ్యక్షులు బి.రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, బసంత్ సింగ్, మాజీ కౌన్సిలర్ వెంకట రెడ్డి గ, గ్రామ పెద్దలు శాంతి రెడ్డి, కిష్టప్ప, రామ్ రెడ్డి, అశోక్, కృష్ణ, చిన్నప్ప, బాల్ రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.
