AP | కవాతు రిహార్సల్స్ ను పరిశీల‌న‌..

AP | కవాతు రిహార్సల్స్ ను పరిశీల‌న‌..

AP | కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : జనవరి 26న నిర్వహించనున్న గణ తంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా పరేడ్ రిహార్సల్స్‌కు అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణ మోహన్ హాజరై గౌరవ వందనం స్వీకరించి, కవాతును పరిశీలించారు. జాతీయ పతాకం ఆవిష్కరణ, అతిధుల గ్యాలరీలు, స్టాల్స్ ను అడిషనల్ ఎస్పీలు పరిశీలించారు. ఈ వేడుకలకు అతిథులు, ప్రముఖులు, విద్యార్థులు హాజరవుతున్నందున అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై పోలీసు సిబ్బందికి పలు సూచలను తెలియచేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు డిఎస్పీ ప్రసాద్, ఆర్ ఐలు, ఆర్ ఎస్సైలు, సివిల్, ఎఆర్, ఎన్ సిసి, స్కౌట్ విద్యార్దులు పాల్గొన్నారు.

Leave a Reply