Bachannapet | మ‌నోజ్ఞ‌కు మిస్ ఇయ‌ర్ ఆఫ్ ది అవార్డు…

Bachannapet | మ‌నోజ్ఞ‌కు మిస్ ఇయ‌ర్ ఆఫ్ ది అవార్డు…

Bachannapet | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, డీసీపీ రాజమహేంద్ర నాయక్ చేతుల మీదుగా వాణి హై స్కూల్ విద్యార్థిని పోతుల మనోజ్ఞకు మిస్ జనగాం ఇయర్ ఆఫ్ ది గర్ల్-2026 అవార్డు అందజేశారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని, మిషన్ శక్తి జిల్లా మహిళా సాధికారిత కేంద్రం, జనగామ వారు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సాంసృతిక కార్యక్రమాలలో వాణి హై స్కూల్ చెందిన మూడవ తరగతి విద్యార్థిని పోతుల మనోజ్ఞ పాల్గొని క్లాసికల్ డాన్స్, జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించడం జరిగిందన్నారు.

ఇందుకు గాను పోతుల మనోజ్ఞ కు మిస్ జనగాం ఇయర్ ఆఫ్ ది అవార్డుకు ఎంపిక చేయటం జరిగింది. ఈ అవార్డు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, అడిషనల్ కలెక్టర్ పి. బెన్ షాలమ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయటం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్, డీసీపీ మనోజ్ఞను అభినందించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలు గా జిల్లా పరిషత్ సి ఈ ఓ సరిత గారు, డీఆర్ డీఓ వసంత , జిల్లా వ్యవసాయ అధికారి అంబిక సోని, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ అధికారి చౌదరీశ్వరి తదితరులు వ్యవహరించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కరుని సుమలత మాట్లాడుతూ… తమ స్కూల్ విద్యార్థి పోతుల మనోజ్ఞ జిల్లా స్థాయిలో నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి అవార్డు అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాకుండా అభినందించారు. అలాగే స్కూల్ ఉపాధ్యాయులు శ్వేత, శ్రీలత, హైమావతి, మౌనిక, శ్రీనివాస్, బాబు, వాణి, స్వప్న, పద్మ, స్వాతి, వినయ్, షారూక్ అభినందించారు.

Leave a Reply