Right to Vote | ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి ఓటు హక్కు..

Right to Vote | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యవ్యవస్థకు ఊపిరి ఓటు హక్కు అని ఓటు హక్కు వెలకట్టలేనిదని ఊట్కూర్ తహశిల్దార్ చింత రవి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని సీనియర్ ఓటర్లను సన్మానించామని అన్నారు.
ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందని ధర్మాన్ని కాపాడే ఓటు హక్కు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయనిఅన్నారు.
ఓటు హక్కును డబ్బు మధ్యానికి అమ్ముకోవద్దని ఎన్నికల్లో సమర్ధుడైన నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో ర్యాలీలు ప్రతిజ్ఞ మానవహారం చేపట్టినట్లు తెలిపారు. ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ఓటర్ దినోత్సవ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐలు కృష్ణారెడ్డి, వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యగ్నేశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, నాయకులు అనిల్ రెడ్డి, బాలాంజనేయులు, ఇస్మాయిల్, రోసినప్ప తదితరులు పాల్గొన్నారు.
