Minister Ponnam | తహసీల్దార్ కార్యాలయ భవనానికి నిధులు..

Minister Ponnam | ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల మంజూరుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక కృషి, చొరవ ఫలితంగా సాధ్యమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి కార్యాలయం మరియు రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయం చేసి నిధులు మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.

భూసేవల కమిషనర్, జిల్లా కలెక్టర్ హనుమకొండ నివేదికల ఆధారంగా ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి మంజూరు చేయబడినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఇది పూర్తయితే ఎల్కతుర్తి మండల ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. “ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా చేరాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాం. ఎల్కతుర్తి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని ఒక ప్రకటనలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు.స్థానిక

Leave a Reply