Urkonda | ముగ్గురు చిన్నారులు మృతి

Urkonda | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లెలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నానమ్మను చూసేందుకు చిన్నారులు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆడుకొనేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ పొలంలోని నీటి కుంటలో పడి ప్రాణాలు విడిచారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి.

Leave a Reply