Bonalu | పోచమ్మకు బోనాలు..

Bonalu | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని చిన్న రామన్ చర్ల గ్రామంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ మారు పండగ 11 నెలలను పురస్కరించుకొని అమ్మవారి దర్శనం కోసం మహిళలు భక్తిశ్రద్ధలతో నెత్తిన బోనాలతో బారులు తీరారు. చిన్న రామన్ చర్ల గ్రామంలో కుమ్మరి కులస్తులు డప్పు చప్పుల్ల శివసత్తుల పూనకాల మధ్య ఇంటింటా భక్తిశ్రద్ధలతో బోనాలను నెత్తిన పెట్టుకొని పిల్లాపాపలు, బంధుమిత్రులతో బయలుదేరి బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు.

పంబాల పూజారుల వేషధారణ, పెద్దపట్నంలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. మహిళలు గాజులు సీరే సారెలు సమర్పించి ఒడి బియ్యాలు పోసి పాడిపంట చల్లగా ఉండాలని గుడి చుట్టూరా తిరిగి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎండి ఆజామ్, ఉపసర్పంచ్ కంత్రి యాదయ్య, కుమ్మరి సంఘం అధ్యక్షులు గుడికందుల పరుశరాములు, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి బాల నరసయ్య , ప్రధాన కార్యదర్శి గుడికందుల కనకయ్య, కోశాధికారి రేణిగుంట సత్యనారాయణ, సంఘ సభ్యులు, మహిళలు బంధుమిత్రులు పలువురు పాల్గొన్నారు..

Leave a Reply