MODI | మన్‌కీ బాత్‌..

MODI | మన్‌కీ బాత్‌..

MODI | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మన దేశ పరిశ్రమలు, స్టార్టప్‌లు తమ వస్తువుల తయారీలో నాణ్యతపై దృష్టి సారించాలని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నాణ్యతను ఒక బెంచ్‌మార్క్‌లా చేసేందుకు సంకల్పించాలని పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్‌ 130వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు. భారతీయ ఉత్పత్తులు టాప్‌ క్వాలిటీకి పర్యాయపదంగా మారాలని సూచించారు. లోపాలు లేని వస్తువులను తయారు చేయాలని పరిశ్రమలను కోరారు. వస్త్రాలు, టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, ప్యాకేజింగ్‌.. ఇలా మనం తయారు చేసే ఏ వస్తువైనా ఉత్తమంగా ఉండేలా చూడాలన్నారు.

రేపు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని, ఈ సందర్భంగా.. రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకోవాలన్నారు. అలాగే ఇవాళ ఓటర్ల దినోత్సవం. మన దేశంలో 18 ఏళ్లు రాగానే ఓటు హక్కు పొందుతాం. మన దేశ నిర్మాణంలో ఓటర్‌గా మారడం చాలా ముఖ్యమన్నారు. దాన్ని ఉత్సవంలా చేసుకోవాలి. తొలిసారి ఓటర్ అయ్యేవారికి.. మిగతా వారు.. శుభాకాంక్షలు చెప్పాలి. ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారో.. వారందరికీ తాను శుభాకాంక్షలు చెబుతున్నానన్నారు.

Leave a Reply