Rally | ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైనది

Rally | ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైనది
- కడెం తహసిల్దార్ రొడ్డ ప్రభాకర్
Rally | కడెం( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమైనదని కడెం మండల తహసిల్దార్ రొడ్డ ప్రభాకర్ అన్నారు. 16వ ఓటరు జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కడెం జడ్పీ ఎస్ ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తహసిల్దార్ కార్యాలయం అధికారులు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ఓటర్ల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కడెంలో పలు వీధుల గుండా జాతీయ ఓటర్ దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించి కడెంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఓటరు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఓటరు అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని అన్నారు ప్రజాస్వామ్యానికి ఓటుతో బలమని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్, కొత్త యవ ఓటర్లకు శాలువలు కప్పి కడెం మండల తహసిల్దార్ ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కడం ఎంఆర్ ఐ శారద, కడం జడ్పీ ఎస్ ఎస్ పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరెడ్డి, బిఎల్ ఓలు జాడి రాజేశ్వరి, నేరెళ్ల గంగమని, కరుణ పాఠశాల ఉపాధ్యాయులు కడెం రెవెన్యూ కార్యాలయం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
