Dhammapet | తుమ్మలను కలిసిన పోలీసులు

Dhammapet | దమ్మపేట , ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా , అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలపరిధిలోని గండుగులపల్లిలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగృహంలో ఆదివారం గంగారం 15వ బెటాలియన్ కు చెందిన పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సుదీర్ఘ కాలపు బదిలీల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది విన్నపాన్ని విన్న మంత్రి, ప్రస్తుతం బదిలీల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.
ఈ సమస్యపై సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం లభించేలా చూస్తానని వారికి భరోసా ఇచ్చారు. మంత్రి స్పందన పట్ల పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జెడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు ,కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
