TG | ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌ కు సన్మానం..

TG | ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌ కు సన్మానం..

TG, చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామ అభివృద్ధి కోసం నిధులను విడుదల చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కైరంకొండ స్వప్న అశోక్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేశారు. ఎంపీకి శాలువా కప్పి సన్మానించారు. గ్రామం బైపర్ కేషన్ తర్వాత గత ఏడు సంవత్సరాలుగా గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో గ్రామంలో సమస్యలు పరిష్కారం కాక గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయిందని గ్రామ సర్పంచ్ స్వప్న అశోక్ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కు వివరించారు.

జాతీయ రహదారి నుండి గ్రామానికి వచ్చే అండర్ పాస్ ఇరుకుగా ఉన్నందున వెడల్పు చేయాలని, గ్రామంలో హెల్త్ సెంటర్ కు ప్రహరీ గోడ నిర్మించాలని తదితర సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీని సర్పంచ్ కోరారు.

Leave a Reply