Searches | కామారెడ్డి కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు..

Searches | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి కలెక్టరేట్లోని పౌరసరఫరా శాఖ కార్యాలయంలో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు తనిఖీలు చేపట్టారు. పౌరసరఫరాలకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తూ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
