Devotees | కిక్కిరిసిన జనం.. నాగోభా భవనం..

Devotees | కిక్కిరిసిన జనం.. నాగోభా భవనం..
- జాతర 25 వరకు అధికార ప్రకటన,,,
- కనీసం పురాతన నాగోబా జాతరలా అభివృద్ధి పరచాలి
- సెలవు దినాలు ఉన్నందున జనసాంద్రత పెరిగే అవకాశం
Devotees | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లాఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా అడవిలో ఉమ్మడి అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి, మొక్కులు తీరుస్తూ జై నాగోబా జై జై నాగోబా అని నినాదాలు చేస్తు, మూడు నుండి నాలుగు గంటల పాటు దర్శనానికి క్యూలో నిలబడి దర్శించుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల రద్దీ అకస్మాత్తుగా భారీగా పెరిగింది. అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన పోలీస్ భారీ బందోబస్తు, భక్తులకు అన్ని సౌకర్యాలు, అధికారికంగా కల్పిస్తున్నందుకు భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకుంటున్నారు.

వారం రోజులపాటు మేశ్రమ వంశీయుల ప్రత్యేక పూజలతో జాతర వాతావరణం కనిపించింది. అయినా మేశ్రమవంశస్తులు లేకుండా ఉట్నూరు మండలం షాంపూ జాతర పూజలకు వెళ్లి నేడు అక్కడ పూజ జరుగుతున్న సందర్భంగా కేస్లాపూర్ లో పరిసర ఉమ్మడి జిల్లాల నుండి వచ్చిన భక్తుల సందడి తగ్గడం లేదు. ఇప్పటికైనా గతంలో జరిగే జాతర రూపురేఖలను మార్చవలసిన అవసరం, జాతరను అభివృద్ధి పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మ్మడి జిల్లాల నాగోబా భక్తులకు కేస్లాపూర్ జాతర వారం రోజులపాటు జరిగే జాతర ఆనందం మరో తీరుగా ఉంటుందని భక్తులు తమ ఆలోచన వ్యక్తం చేస్తున్నారు.

