Farmer | ఏరువాక కేంద్రానికి ఉత్తమ పురస్కారం..

Farmer | క‌ర్నూలు జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న ఏరువాక కేంద్రానికి (DAATTC) వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు 2024-25 సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఏరువాక కేంద్రంగా ఎంపికైనట్లు నంద్యాల సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ జాన్సన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏరువాక కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పి. సుజాతమ్మ తో పాటు సిబ్బందిని అభినందించారు.

జిల్లాలోని రైతాంగానికి వివిధ పంటల్లో నూతన రకాలను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం, పంటల ఉత్పాదకత పెంపు, సమగ్ర చేడపీడల నివారణ, వ్యవసాయంలో యాంత్రీకరణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు, ప్రచారం, శిక్షణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ప్రదర్శన క్షేత్రాలను నిర్వహించడంలో ఏరువాక కేంద్రం విశేషంగా కృషి చేసినందుకు ఈ పురస్కారం లభించిందని కొనియాడారు. ఈ సందర్భంగా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి సుజాతమ్మ మాట్లాడుతూ…. రైతులతో నేరుగా అనుసంధానం కలిగి వారి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

భవిష్యత్తులో కూడా రైతుల ఆదాయం పెంపు, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి కోసం మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ అవార్డు కర్నూలు జిల్లా ఏరువాక కేంద్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని అందించడంతో పాటు జిల్లా వ్యవసాయ అభివృద్ధికి ఘన నియమైనా ప్రోత్సాహంగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ పురస్కారాన్ని ఈనెల 29న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శారద జయలక్ష్మి చేతుల మీదగా అందజేయనున్నారు.

Leave a Reply