Sindhura Reddy | పురాతన ఆలయాలను పునరుద్ధరణ, పరిరక్షణ…

Sindhura Reddy | పురాతన ఆలయాలను పునరుద్ధరణ, పరిరక్షణ…

  • టీటీడీని కోరిన పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి

Sindhura Reddy | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పుట్టపర్తి నియోజకవర్గంలోని పురాతన కాలంనాటి ఆలయాల పునర్నిర్మాణం, పునరుద్ధన, పరిరక్షణ చేయాలని టిటిడినీ కోరి నట్లు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఈ రోజు ఆమె ఇందుకు సంపాదించిన వివరాలను వెల్లడించారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని వైష్ణవ కాలంనాటి దేవాలయాలైన కొత్తచెరువు మండలం మీర్జాపురం పంచాయతీలోని పాతదేవరపల్లిలో ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించి వాటి పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో నిధులు కేటాయించి చర్యలు తీసుకోవాలని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రత్యేకంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు రాతపూర్వకంగా తన లేఖను అందజేశారు.

అదేవిధంగా మొదట‌ విష్ణువర్ధన రాజు కాలంనాటి కాలంలో నిర్మించిన పురాతన బుక్కపట్నం చెరువు దగ్గర ఉన్న వరగిరి వెంకటరమణ స్వామి ఆలయం పునః నిర్మాణంతో పాటు పరిరక్షణ, పునరుద్ధరణ చేపట్టే విధంగా టీటీడీ తరపున నిధులు మంజూరు చేయాలని కోరారు. అంతేగాకుండా రెండవ విష్ణువర్ధన రాజు కాలంలో బుక్కపట్నం పట్టణంలో నిర్మించిన పురాతనమైన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని టీటీడీ నిధులతో పునర్నిర్మాణం, పరిరక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. కొత్తచెరువు మండలం మీర్జాపురం పంచాయతీలోని పాత దేవరపల్లిలో హోయ సాల సామ్రాజ్యంలో 10వ శతాబ్దం _14 వ శతాబ్దం నాటి విజయనగర రాజుల కాలంలో నిర్మించిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణం పరిరక్షణ పునారుద్ధరణతో పాటు మిగతా ఆలయాలలో ధూప దీపాల నైవేద్యం నిర్వహించే పూజారులకు ప్రతినెల గౌరవ వేతనం ధూప దీపాల నిధులను మంజూరు చేయాలని కోరుతూ అందుకు సంబంధించిన తన లేఖను టీటీడీకి అందజేశారు.

అంతేగాకుండా ఈ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి ఐదు రకాల శిలాశాసనాలు ఉన్నాయని వందలాది ఎకరాల దేవుని మాన్యాలు ఉన్నాయని, ఇవి పూర్తిగా అన్యాక్రాంతం కావడంతో వాటి పరిరక్షణకు టీటీడీ తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అదేవిధంగా ఈ పురాతన దేవాలయంలో ఏకాదశి వైకుంఠ ఏకాదశి తో పాటు ఇతర ముఖ్యమైన వైష్ణవ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు.

Leave a Reply