TG | ఎమ్మెల్యే సహకారంతో మరింత అభివృద్ధి

TG | మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 11వ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాముల్ల అశోక్ తేజ మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ ఆర్ ఆదేశాల మేరకు గోదావరి రోడ్ శ్రీ మల్లికార్జున ఆలయం వద్ద నూతన బోరుబావిని వేయించారు. ఈ సందర్భంగా డివిజన్ సభ్యులు అశోక్ తేజను అభినందించారు. తేజ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు 11 డివిజన్లో చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ అందించే సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజల వద్దకు చేర్చడం తన కర్తవ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో 11 వార్డ్ డివిజన్ ఇంచార్జ్ గాండ్ల సాంబయ్య, నాయకులు గోదారి బక్కయ్య , గోపి, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply