distribution | సొంతింటి మంజూరు పత్రాల అందజేత

distribution | సొంతింటి మంజూరు పత్రాల అందజేత
- ఇప్పటికీ 66 ఇందిరమ్మ ఇళ్లు
distribution | రెంజల్, ఆంధ్రప్రభ : మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అందజేశారు. స్థానిక సర్పంచ్ ఎత్తరి మాధవి సాయిలు, ఎంపీడీవో వారణాసి కమలాకర్ లతో కలిసి 16 ఇండ్ల పత్రాలను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిపాలైన వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన ఎల్ఓసి పత్రాలను మొట్ట చెప్పారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోబిన్ ఖాన్ మాట్లాడుతూ…తమ ప్రభుత్వం అధికారాల్లోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని చెప్పారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరైన ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. ఒకటి, రెండు బిల్లులు ఇచ్చి మిగిలినవి లబ్ధిదారులకు ఇవ్వకుండా పంగనామం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత పది ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కటిగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఎంత కష్టమైనా అమలు పరుస్తున్నారని అన్నారు.
లబ్ధిదారుల 66 ఇళ్లకు ఇప్పటికీ రూ.3.3 కోట్లలో పైసా కూడా ఎవరు లంచం ఇవ్వలేదని మోబిన్ ఖాన్ గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీఓ రఫీ అహ్మద్, దండిగుట్ట సర్పంచ్ ధనుంజయ్, కార్యదర్శి వెంకటరమణ, మాజీ సర్పంచ్ వినోద్ కుమార్,ఎత్తరి సాయిలు, బన్సీ నాయక్, చౌకత్, మల్లేష్, తదితరులు ఉన్నారు.
