Action entertainer | 26న డేవిడ్ రెడ్డి ఫ‌స్ట్‌లుక్

Action entertainer | వెబ్‌డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : మంచు మనోజ్ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఓ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ చేయ‌బోతున్నాడు. అదే డేవిడ్‌రెడ్డి మూవీ. ఈ చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి, ఫైట్ మాస్టర్ సుప్రీమ్ సుందర్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తుండటం విశేషం. అయితే ‘డేవిడ్ రెడ్డి’ కి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ జనవరి 26న, అంటే రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు మనోజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

Leave a Reply