250 Crores | మేడారం గద్దెల ప్రాంగణం మహా పునర్నిర్మాణం: వెయ్యేళ్లు నిలిచే అభివృద్ధి

250 Crores | మేడారం గద్దెల ప్రాంగణం మహా పునర్నిర్మాణం: వెయ్యేళ్లు నిలిచే అభివృద్ధి

  • రూ.250 కోట్లతో మేడారం మహా జాతర అభివృద్ధి
  • కోయ సంస్కృతికి అద్దం పట్టే శిల్పాలు, శాశ్వత ఏర్పాట్లు
  • మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వ వివక్ష
  • జాతీయ పండుగ హోదా ఇవ్వాలని డిమాండ్

250 Crores | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ: వెయ్యి సంవ త్సరాల పాటు నిలిచిపోయేలా గద్దెల ప్రాంగణాన్ని ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పునర్ని ర్మాణం చేయడం మహా అద్భుతంగా ఉందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొనియాడారు. మంగళవారం ములుగు జిల్లా తడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Mla Kadiam Srihari) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు అమ్మవార్లకు ఎత్తు బంగారం మొక్కు చెల్లించుకు న్నారు. అనంతరం అమ్మవార్లకు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. దర్శనానంతరం ఎంపీ, ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.

250 Crores

250 Crores | ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నూతన వైభవాన్ని సంతరించుకుందన్నారు. మేడారం మహా జాతరను ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన బిడ్డల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లతో మేడారంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని తెలిపారు. అడవి తల్లుల చరిత్రను చాటి చెప్పేలా, కోయ సంస్కృతికి అద్దం పట్టే విధంగా అనేక శిల్పాలు, బొమ్మలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఒకప్పు డు జాతర సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారని, ప్రస్తుతం ఏడా ది పొడవునా భక్తులు వస్తుండటంతో శాశ్వత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆరు పర్యాయాలు మేడారం జాతర ఏర్పాట్లను పర్యవే క్షించి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని గుర్తు చేశారు. అయితే వాటన్నింటికన్నా మిన్నగా కాంగ్రెస్ ప్రభుత్వం మేడా రం మహా జాతర అభివృద్ధి చేపట్టిందని స్పష్టం చేశారు.

250 Crores

250 Crores | మేడారం జాతరపై కేంద్ర ప్రభుత్వ వివక్ష..

ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Srihari) ఆరోపించారు. ఉత్తరాది ఆలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కోట్లాది మంది ప్రజలు, గిరిజనుల దక్షిణాది కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారానికి మాత్రం నామమాత్రపు నిధులు కూడా కేటాయించకపోవడం దురదృష్ట కరమని అన్నారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వా లని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది గిరిజన సంస్కృతిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వివక్షను వీడి, కోట్లాది ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

250 Crores
250 Crores

CLICK HERE TO READ సర్పంచ్ ఎక్కడ..?

CLICK HERE TO READ MORE

Leave a Reply