IPL 2025 | ఆన్‌లైన్‌లో ఎస్ఆర్‌హెచ్ టికెట్లు.. కీల‌క అప్‌డేట్ !

ఐపీఎల్ 2025 18వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఆటగాళ్లపై కాసులు కురిపించే ఈ మెగా టోర్నమెంట్ ఈ నెల 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) మేనేజ్మెంట్ కీలక ప్రకటన చేసింది.

ఈ సీజ‌న్ ఐపీఎల్లో మార్చి 23న ఎస్ఆర్‌హెచ్ తమ తొలి లీగ్ మ్యాచ్ ఆడనుండ‌గా… ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఢీ కొన‌నుంది. ఇక‌ మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.

అయితే, ఈ మ్యాచ్‌లు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగ‌నుండ‌గా.. ఈ మ్యాచ్ టిక్కెట్లను రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *