Dharna | స‌మ‌స్య‌లు వెంట‌నే నెర‌వేర్చాలి..

Dharna | చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు ఎనిమిది సంవత్సరాలుగా నెలకొన్న స్థానిక సమస్యలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ… చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రధాన సమస్యలైన బైపాస్ రోడ్డు నిర్మాణం, గోదావరి తీరంలో స్మశానవాటిక నిర్మాణాలతో పాటు అసంపూర్తిగా నిర్మించిన ఇంటిగ్రేడ్ మార్కెట్ పనులు, ఆగిపోయిన డిపో నిర్మాణ‌ పనులు తక్షేణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply