Varanasi | రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్ చేసిన జక్కన్న

Varanasi | రిలీజ్ కి ముహుర్తం ఫిక్స్ చేసిన జక్కన్న
Varanasi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli).. ఈ ఇద్దరి కాంబినేషన్లో భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీ వారణాసి (Varanasi) రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఇంత వరకు వారణాసి రిలీజ్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని.. ఎప్పుడు అనౌన్స్ చేయాలో జక్కన్న ముహుర్తం ఫిక్స్ చేశారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. అనౌన్స్ చేసేది ఎప్పుడు.? ఈ క్రేజీ మూవీ రిలీజ్ ఎప్పుడు..?

Varanasi | 1300 కోట్ల భారీ బడ్జెట్..
మహేష్, రాజమౌళి కాంబో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తుంటే.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) .. మహేష్ బాబు ఫాదర్ గా నటిస్తున్నట్టు సమాచారం. కోలీవుడ్ యాక్టర్ మాధవన్ కూడా నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా రూపొందుతోన్న ఈ మూవీలో డివోషనల్ టచ్ ఉండడం అనేది మరింతగా ఆసక్తిగా మారింది.

Varanasi | శ్రీరామ నవమి సందర్భంగా..
ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే దాని గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఈ సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 26న అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. రిలీజ్ (Release) ఎప్పుడంటే.. 2027 శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 9న ఉంటుందని సమాచారం. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ.. మీరు ఎంతైనా ఊహించుకోండి అంతకు మించి ఉంటుందని చెప్పారు. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయని.. ఆడియన్స్ ఈ సినిమాని చూసి థ్రిల్ ఫీలవుతారని.. వారణాసి చరిత్ర సృష్టించడం ఖాయమని ఇప్పటి నుంచే టాక్ బలంగా వినిపిస్తుండడం విశేషం.

CLICK HERE TO READ ఈసారి ప్రభాస్, సల్మాన్ మధ్య పోటీ తప్పదా..?
