Balkonda | కాంగ్రెస్ లో చేరిక‌లు

Balkonda | కాంగ్రెస్ లో చేరిక‌లు

Balkonda | బాల్కొండ, ఆంధ్రప్రభ : బాల్కొండ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాండ్ల రాజేందర్ ఇవాళ‌ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు వార్డ్ మెంబర్ ఫాజిలోద్దీన్, మండలంలోని చిట్టాపూర్ వార్డ్ మెంబర్ దాసరి రాజేష్, యువజన సంఘాల సభ్యులు, లినాష్ గౌడ్ లు చేరారు.

వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, జాలాల్ పూర్ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి, నాయకులు గోపు ఉషన్న వాహబ్, శ్రీనివాస్, యూనుస్ ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ గౌడ్, దయాకర్, హరికృష్ణ, సంతోష్ గౌడ్, పద్మారావు, రియాజ్ అలీ, బిట్టు, తేజ తదితర కాంగ్రెస్ నాయకులున్నారు.

Leave a Reply