Thank you | సీఎం సార్..

Thank you | సీఎం సార్..

  • సదర్ మట్ నిర్మాణం పనులు పూర్తి కావ‌డంతో కృత‌జ్ఞ‌త‌లు
  • సీఎంను కలిసిన పి. రాజేశ్వర్ రెడ్డి

Thank you | కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా మామడ మండలం పొనకల్ వద్ద కొత్త సదర్ మట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జులకు కడెం మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండవపూర్ పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ పి రాజేశ్వర్ రెడ్డి కలసి శాలువాలతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తాము 2008 సంవత్సరంలో రైతాంగ వేదిక అధ్యక్షుడు పి. రాజేశ్వర్ రెడ్డి రైతాంగ సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ద్వారా కడం నుంచి మేడంపల్లి సదర్ మట్టు వరకు కాల్వ మరమ్మతులు చేపట్టాలని కోరుతూ తాము పాదయాత్ర చేసి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రికి, జిల్లా ఉన్నత శాఖ అధికారులకు, జిల్లా నీటిపారుదల శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం పోనకల్ గ్రామం వద్ద సదర్ మట్ ప్రాజెక్ట్ బ్యారేజ్ నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు కృషితో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సదర్ మట్ నిర్మాణం పనులు పూర్తి ప్రాజెక్టు ప్రారంభించడంతో నేటితో రైతుల, ప్రజల చిరకాల కోరిక సదర్ మార్ట్ బ్యారేజ్ నిర్మాణం తీరింది.

ఇందుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమా బొజ్జుకు రైతులు, ప్రజల తరుపున పి.రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Leave a Reply