Ram Charan | ఆ వార్తలు నిజమేనా..?

Ram Charan | ఆ వార్తలు నిజమేనా..?

Ram Charan | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న ఈ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్చి 27న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. మరో వైపు నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ప్యారడైజ్. దీనికి శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్. ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఏంటా ఇంట్రెస్టింగ్ న్యూస్…?

Ram Charan

Ram Charan | పెద్ది మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడం..

ఈ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. 200 మిలియన్ వ్యూస్ కు పైగా రాబట్టి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. దీంతో ఈ మూవీ సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుంది అనేది ఆసక్తిగా మారింది. సంక్రాంతికి సెకండ్ సింగిల్ వస్తుందేమో అనుకున్నారు కానీ.. ఎలాంటి అప్ డేట్ రాలేదు. త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషించిందని.. ప్లాష్ బ్యాక్ లో టబు క్యారెక్టర్ వస్తుందని.. టాక్ వినిపిస్తుంది. అలాగే మార్చి 27న పెద్ది రావడం లేదని పోస్ట్ పోన్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

Ram Charan

Ram Charan | ప్యారడైజ్ విషయానికి వస్తే..

ఈ సినిమా నుంచి ఇంత వరకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయలేదు. ఇంకా షూటింగ్ చేయాల్సింది చాలా ఉందని టాక్. అయితే.. మార్చి 26న ప్యారడైజ్ మూవీ రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు కానీ.. ఇప్పుడు మార్చి 26న ఈ సినిమా వచ్చే పరిస్థితి లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ప్యారడైజ్ వస్తుందా..? వాయిదా పడనుందా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. మార్చి 26న ప్యారడైజ్, మార్చి 27న పెద్ది రానున్నట్టుగా ప్రకటించినప్పటి నుంచి రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు రెండు సినిమాలు పోస్ట్ పోన్ అని వార్తలు వస్తుండడంతో ఇది నిజమా..? లేక గాసిప్పా అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. పెద్ది, ప్యారడైజ్ రిలీజ్ గురించి మేకర్స్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Ram Charan

CLICK HERE TO READ పుష్ప 3 స్టార్ట్ చేసేది ఎప్పుడు..?

CLICK HERE TO READ MORE

Leave a Reply