Bodhan | సీఎం కప్ క్రీడల కాగడా ర్యాలీ

Bodhan | సీఎం కప్ క్రీడల కాగడా ర్యాలీ

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం కప్ ర్యాలీ బోధన్ పట్టణంలో ఈ రోజు నిర్వహించారు. బోధన్ మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభ‌మైన ర్యాలీలో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, మండల పరిషత్ ఉద్యోగులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు గ్రామీణ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించ‌నున్నారు. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మండల స్థాయిలో క్రీడా పోటీలు ఉంటాయి. ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో క్రీడలు నిర్వహిస్తారు. ఈ క్రీడల్లో పాల్గొనేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్న క్రీడాకారులు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారి నాగయ్య, బోధన్ పట్టడం ఎస్‌హెచ్ఓ వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply