Public auction | 20న కేసుల్లోని బైకుల బహిరంగ వేలం

Public auction | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ : 33/2025 కేసుకు సంబంధించి స్వాధీనం చేయబడిన బైకులను ప్రభుత్వ ఆదేశాల మేరకు 20వ తేదీన గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించబడునని పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
సదరు బహిరంగ వేలంపాటను గుడివాడ తహసిల్దార్, గుడివాడ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వారి పర్యవేక్షణలో నిర్వహించబడునని పేర్కొన్నారు. కావున వేలంపాటలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు తమ పేర్లను ముందుగా గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ తెలియజేయవలసిందిగా కోరారు.
